తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో..62 మంది స్టూడెంట్స్​కు చోటు 

సత్తుపల్లి, వెలుగు : పట్టణంలోని 62మంది స్టూడెంట్స్​ను ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు దక్కింది. స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో ఆదివారం 62 మంది విద్యార్థులు నిత్య జీవితానికి సంబంధించిన 62 విషయాలను వివరిస్తూ, వాటి వెనుక గల సైన్స్ కారణాలను విశ్లేషణ చేస్తూ ఆయా అంశాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.

శాస్త్రీయ వాస్తవాలు -నిరూపణ’ అనే కార్యక్రమం 2 గంటలపాటు నిరంతరంగా  కొనసాగింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులుగా ఖమ్మంకు చెందిన శ్రీనివాస్, సత్తుపల్లి నుంచి బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా సైన్స్ టీచర్లు ప్రసాద్, శేషుకుమార్ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా 15వ బెటాలియన్ కమాండెంట్ వెంకటరాములు హాజరయ్యారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసాపత్రాన్ని అతిథులు స్కూల్​ యాజమాన్యానికి, స్టూడెంట్స్​కు అందజేశారు.