
- సీఆర్ఓ ఫణీందర్‌రెడ్డి
హైదరాబాద్‌సిటీ, వెలుగు: రేషన్‌కార్డుల కోసం మొత్తం 6.23 లక్షల మంది అప్లై చేసుకున్నారని, ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించే వార్డు సభల్లో అర్హుల జాబితా చదివి వినిపిస్తామని చీఫ్రేషనింగ్ఆఫీసర్(సీఆర్ఓ) ఫణీందర్‌రెడ్డి తెలిపారు. కార్డులు రానివారు, లేనివారు అక్కడే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
కాంగ్రెస్సర్కారు ఏర్పడే నాటికి సిటీ పరిధిలోని 9 సర్కిళ్లలో 43 వేల మంది దరఖాస్తు చేసుకోగా, గ్రేటర్‌పరిధిలోని మరో 40 వేలతో కలిపి 83వేల మంది రేషన్‌కార్డులు లేనివారిని గుర్తించామన్నారు. ప్రజా పాలన, కులగణన సర్వేలో మరో 5.40 లక్షల మంది అప్లై చేసుకున్నట్లు తెలిపారు. త్వరలో బల్దియా అధికారులతో కలిసి దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి పరిశీలించి అర్హులను గుర్తిస్తామన్నారు. ఆ జాబితానే వార్డు సభల్లో ప్రకటిస్తామన్నారు.