మూడేళ్లలో తెలంగాణలో 64 వేల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గత  మూడేండ్లలో 64,083 డ్రైవింగ్​లైసెన్స్‎లను ఆర్టీఏ అధికారులు రద్దుచేశారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 31 వరకు 14 , 220,  2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు 30, 638, 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు 19, 225 డ్రైవింగ్ లైసెన్స్‎లు రద్దయ్యాయి. తాజాగా, 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 నవంబర్ 30 వరకు 10 వేల 113 లైసెన్స్ లను క్యాన్సిల్​చేస్తూ రవాణా శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి ఏటా రద్దయ్యే లైసెన్స్‎లలో 70 శాతం వరకు డ్రంక్​ అండ్​డ్రైవ్​కేసులే ఉంటున్నాయని ఆర్టీఏ ఆఫీసర్లు చెప్తున్నారు. మందుతాగి మొదటిసారి పట్టుబడితే ఫైన్లతో సరిపెడ్తున్న అధికారులు, రెండోసారి, మూడోసారి పట్టుబడితే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్‏లు రద్దు చేస్తున్నారు. కానీ టెక్నికల్ సమస్యలకు తోడు స్టాఫ్‎పై ఇతర పని ఒత్తిడి వల్ల  డ్రైవింగ్ లైసెన్స్‎ల క్యాన్సిల్‎పై సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ఇకపై ప్రతి 6 నెలలు లేదంటే 3 నెలలకోసారి ఎప్పటికప్పుడు వచ్చిన సిఫారసుల ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్‎లను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.