కోటీశ్వరుడు చనిపోయాడు.. ఆ తర్వాత రష్యాలో ప్రత్యక్షం.. ఇదెలా సాధ్యం

చనిపోయాడని  ఓ కోటీశ్వరుడిని కోర్టు ధృవీకరించింది.  2018లో అదృశ్యమయిన  జర్మనీకి చెందిన 64  ఏళ్ల ఓ కోటీశ్వరుడు ఇక లేడని .. 2021చనిపోయాడని చట్టబద్దంగా అక్కడి కోర్టు చెప్పింది.  అయితే అలా కోర్టు చెప్పిన కొన్నాళ్లకు రష్యాలో ఓ మహిళతో కనిపించాడు.   వివరాల్లోకి వెళితే..

కోటీశ్వరుల వ్యక్తిగత విషయాలు.. వ్యాపార లావాదేవీలు.. ఇంకా వారికి సంబంధించిన విషయాలపై ఓ పక్క మీడియా.. మరో పక్క ప్రపంచం  ఆరా తీస్తూనే ఉంటుంది.  సోషల్​ మీడియా ప్రపంచంలో గొప్ప వ్యక్తులకు  సంబందించిన ఏ  విషయమైనా.. అది ఫేస్​ బుక్​, ట్విట్టర్​, ఇన్​స్ట్రాగ్రామ్​ లాంటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతుంది.  కొన్ని సంఘటనలు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగే సంఘటనలు తరచూ వైరల్​ అవుతాయి.  ఇప్పుడు అలాగే జర్మన్​ కు చెందిన ఓ బిలియనీర్​ విషయం సోషల్​ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.  కార్ల్-ఎరివాన్ హాబ్  అనే వ్యక్తి ఆల్ప్స్ పర్వతాలలో తిరుగుతూ  2018లో హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. కుటుంబంలోని వ్యక్తి ఎవరైనా కనపడకపోతే ఆ కుటుంబసభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు.  చాలా రోజులుగా ఆయన కోసం జర్మన్​ పోలీసులు గాలించారు.  ఆయన మృతదేహం కూడా ఎక్కడా లభించలేదు.. ఆయన ఆచూకీ కూడా దొరకలేదు.  దీంతో ఎరివాన్  మరణించినట్లు 2021లో అక్కడి కోర్టు చట్టబద్దంగా ధృవీకరించింది.  దీంతో ఆయన కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.  ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.


 కార్ల్-ఎరివాన్ హాబ్ స్విట్జర్లాండ్‌లోని మాటర్‌హార్న్ పర్వతంపై స్కీయింగ్ శిక్షణ తీసుకుంటున్నాడు. అతనిని చివరిగా  ఓ రోజు ఉదయం  స్కీ లిఫ్ట్‌ అనే మహిళకు  ఒంటరిగా నడుచుకుంటూ కనిపించాడని పోలీస్​ విచారణలో తేలింది.  ఆ తరువాత ఎరివాన్  ఆయన ఇంటికి గాని.. ఆయన తరచూ వెళ్లే హోటల్​లో సంప్రదించినా  రాలేదు. ఆయన కోసం రెస్క్యూ టీమ్​ ...  ఐదు హెలికాప్టర్ల సాయంతో వెతికారు.  అయినా ఎరివాన్ ఆచూకీ లభించక పోడంతో 2021 లో, జర్మన్ కోర్టు అతన్ని చట్టబద్ధంగా చనిపోయినట్లు ప్రకటించింది.


 చనిపోయినట్లు ధృవీకరించిన కార్ల్-ఎరివాన్...  ఆస్తులు 5.2 బిలియన్ పౌండ్లుగా అంచనా జర్మన్​ ప్రభుత్వం అంచని వేసింది.  ఎరివాన్ ఓ పెద్ద సంస్థ   టెంగెల్‌మాన్‌ ను నడుపుతున్నారు.  అందులో సుమారుగా 75 వేలకుపైగా ఉద్యోగులు ఉన్నారు. అతని సోదరుడు క్రిస్టియన్​తన సోదరుడు మరణించినట్లు కోర్టు ధృవీకరించిందని  కోర్టులో  అఫిడవిట్​ దాఖలు   చేశారు. ఇదిలా ఉండగా జర్మన్​ మీడియా ఓ అదిరిపోయే వార్తను ప్రసారం చేసింది.  2018 లో తప్పిపోయన ఎరివాన్​ మాస్కోలో ( రష్యా)  ఓ మహిళతో ఉన్నాడని.. కొతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారని జర్మన్​ మీడియాలో వార్తలొచ్చాయి.   

, కార్ల్-ఎరివాన్ ...వెరోనికా ఎర్మిలోవా అనే మహిళతో నివసిస్తున్నారని తెలిపింది. వెరోనికా  కూడా చాలా ధనవంతురాలు.  అయితే ఎరినోవా 2018 లో అదృశ్యమయ్యే ముందు  వెరోనికా ఫోన్‌కి మూడు రోజుల్లో 13 సార్లు కాల్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.  ఆ ఫోన్​ సంభాషణలు కొన్ని గంటల పాటు జరిగాయని జర్మన్​ మీడియా ద్వారా తెలుస్తోంది.  44 ఏళ్ల వెరోనికా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రజలకు స్కీయింగ్ శిక్షణ ఇచ్చే ఈవెంట్​ ఏజన్సీని నడుపుతుంది,  అంతే కాకుండా ఆమె రష్యా గూఢచార సంస్థ ఎఫ్‌ఎస్‌బిలో పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  అయితే ఇప్పుడు జర్మన్​ పోలీసులు, నిఘా సంస్థలు ఎరినోవా అదృశ్యం కేసు గురిచి మళ్లీ  విచారణ చేపట్టాయి.