కాగజ్ నగర్, వెలుగు: దాదాపు 65 మిలియన్ ఏండ్ల కింద అంతరించిపోయిన పాజియోఫిలమ్ పిలోఫిలమ్, టీనియోప్టెరిస్ మొక్కల శిలాజాలను ఆసిఫాబాద్ జిల్లాలో పరిశోధకులు గుర్తించారు. కాగజ్ నగర్ మండలం రాంపూర్ లో అద్దంకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ పురావస్తు పరిశోధకులు సముద్రాల సునీల్ ఈ అరుదైన శిలాజాలను కనుగొన్నారు. స్థానికంగా తయారు చేసే సిరామిక్ పైప్‌లకు వినియోగించే మట్టిలో ఈ శిలాజాలు కనిపించాయన్నారు.
సునీల్ మాట్లాడుతూ ఈ వృక్ష జాతులకు చిత్తడి నేలలు, సరస్సులు, నదీ తీర జలమార్గాల అంచులు అనుకూలమైన వాతావరణంగా ఉండేదని తేలిందన్నారు. ఈ మొక్క శిలాజాలే కాకుండా ఈ ప్రాంతంలో మరికొన్ని రకాల జంతువుల శిలాజాలు దొరికాయని, వాటిపై పరిశోధనలు జరుగుతున్నాయ న్నారు. ఈ మొక్కలు డైనోసార్స్కాలం తర్వాత నుంచి క్రెటేషియస్ యుగం చివరి వరకు జీవించి ఉండేవని, మహారాష్ట్రకు చెందిన గోండ్వానా యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్ నుస్రత్ బాబర్ తెలిపారు. అద్దంకి ఫౌండేషన్ చైర్మన్ అద్దంకి కిరణ్ పాల్గొన్నారు.