భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని లక్ష్మీదేవిపల్లి పోలీసులు పట్టుకున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్తెలిపారు. గురువారం లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. గురువారం లక్ష్మీదేవిపల్లి పోలీసులు రేగళ్ల క్రాస్‌రోడ్ వద్ద వెహికల్స్తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక లారీలో రూ. 1.62కోట్ల చేసే 650 కిలోల గంజాయి పట్టుబడింది.
లారీని సీజ్ చేసి డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్సుందర్ రామ్, క్లీనర్ సురేశ్‌తో కలిసి మూంగ్‌దాల్ లారీ లోడ్‌తో రాజస్థాన్‌నుంచి రాజమండ్రికి గత నెల 28న వచ్చారు. గురువారం తిరుగుప్రయాణమయ్యారు. రాజస్థాన్‌కు చెందిన ఓం ప్రకాశ్సూచన మేరకు చింతూరు వద్ద గంజాయిని లోడ్ చేసుకొని తీసుకొచ్చినట్లు తేలింది. ఓం ప్రకాశ్‌తో పాటు సుందర్ రామ్, సురేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓం ప్రకాశ్ పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు.