నిరుటి కన్నాఈజీగా నీట్.. 65 వేల మంది పరీక్షకు హాజరు

నిరుటి కన్నాఈజీగా నీట్..  65 వేల మంది పరీక్షకు హాజరు

హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్‌‌, బీడీఎస్‌‌ తదితర మెడికల్  కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్  ఎలిజిబిలిటీ  కమ్ ఎంట్రన్స్‌‌  టెస్ట్‌‌  (నీట్) 2023 క్వశన్ పేపర్ నిరుటి కన్నా సులభంగా వచ్చిందని స్టూడెంట్లు, కోచింగ్  సెంటర్ల నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకూ నీట్  ఎగ్జామ్ జరిగింది. మణిపూర్‌‌‌‌లో అల్లర్లు జరుగుతున్నందున, ఆ రాష్ట్రంలో పరీక్షను వాయిదా వేశారు. దేశవ్యాప్తంగా ఈసారి సుమారు 20.50 లక్షల మంది ఎగ్జామ్‌‌  రాయగా, మన రాష్ట్రం నుంచి సుమారు 65వేల మంది ఉన్నారు. 

గ్రేటర్  హైదరాబాద్, కరీంనగర్‌‌, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌‌, సంగారెడ్డి, మహబూబ్‌‌నగర్‌‌, ఆది లాబాద్‌‌, భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, జగిత్యాల, జనగామ, కొత్తగూడెం, మహబూబాబాద్‌‌, మంచిర్యాల, మేడ్చల్‌‌, నల్గొండ, నిజామాబాద్‌‌, సిద్దిపేట, సూర్యాపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్​ ఈజీగా ఉండటంతో కటాఫ్  స్కోర్  పెరిగే చాన్స్​ ఉందని నిపుణులు చెబు తున్నారు. మన రాష్ట్రం నుంచి నిరుడు 59 వేల మంది నీట్  ఎగ్జామ్ రాయగా 56 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఈసారి ఎగ్జామ్  రాసిన 65 వేల మందిలో కనీసం 40 నుంచి 45 వేల మంది క్వాలిఫై అయ్యే చాన్స్​ ఉందని ఎక్స్ పర్ట్స్  పేర్కొన్నారు. మన కాలేజీల్లో 8వేలకుపైగా ఎం బీబీఎస్‌‌  సీట్లు అందుబాటులో ఉన్నాయి.