విదేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయులు (ఎన్నారైలు)1.34 కోట్లు ఉండగా.. వారిలో 88.8 లక్షల మంది అంటే సుమారు 66 శాతం మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జులై 27న చెప్పింది.
స.హ. చట్టం కింద ఈ వివరాలకు దరఖాస్తు చేసుకోగా సమాచారం బయటకి వచ్చింది. నాగ్‌పుర్ కి చెందిన అభయ్ కొలార్కర్ స.హ. చట్టం కింద వివరాల కోసం దరఖాస్తు చేశారు. 210 దేశాల్లో ఇండియన్స్ ప్రవాసులుగా ఉండగా.. గల్ఫ్‌దేశాల్లో ఒక్క యూఏఈలోనే 34 లక్షల మంది నివసిస్తున్నారు.
AsloRead: కాంగ్రెస్ జీహెచ్‌ఎంసీ ముట్టడి..ఉద్రిక్తత.. వరద బాధితులకు రూ.10వేలు డిమాండ్
ఆ ప్రాంతం ఇనహా ఇతర దేశాల వారీగా చూస్తే యూఎస్‌లో 12.8 లక్షలు, బ్రిటన్‌లో 3.5 లక్షలు, ఆస్ట్రేలియాలో 2.4 లక్షల మంది ఉన్నారు. భారత సంతతి ప్రజలు అమెరికాలో 31లక్షల మంది ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
మలేసియాలో 27.6, మియన్మార్ 20లక్షలు, శ్రీలంకలో 16 లక్షలు, కెనడాలో 15.11 లక్షల మంది ఉన్నారు.