గ్రేటర్ ఎన్నికల్లో 68 నామినేషన్లు రిజెక్ట్

గ్రేటర్ ఎన్నికల్లో 68 నామినేషన్లు రిజెక్ట్

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ  ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో 68 రిజెక్ట్ ​అయ్యాయి. మొత్తం 1,893 మంది అభ్యర్థులు 2,575 నామినేషన్లు దాఖలు చేయగా శనివారం జరిపిన పరిశీలనలో 68 నామినేషన్లను సంబంధిత రిటర్నింగ్ అధికారులు రిజెక్ట్​చేశారు. ప్రస్తుతం బీజేపీ నుంచి 539, టీఆర్ఎస్ 527, కాంగ్రెస్ 348, టీడీపీ 202, ఎంఐఎం 72, సీపీఐ నుంచి 22, సీపీఐ(ఎం) 19, రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుంచి 143, ఇండిపెండెంట్ల 613 నామినేషన్లు సరిగ్గా ఉన్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఆదివారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.