సికింద్రాబాద్, వెలుగు : దసరా, దీపావళి, ఛట్పండుగలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అక్టోబరు 1 నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకు వివిధ మార్గాల్లో 68 సర్వీసులను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్– రామనాథపురం– సికింద్రాబాద్, కాచిగూడ– -మధురై– -కాచిగూడ, నాందేడ్– ఈరోడ్– -నాందేడ్, కాచిగూడ-– నాగర్సోల్– -కాచిగూడ, సికింద్రాబాద్– -కొల్లం– -సికింద్రాబాద్, తిరుపతి-–అకోలా-– -తిరుపతి, పూర్ణ-– తిరుపతి– -పూర్ణ, తిరుపతి– సికింద్రాబాద్– -తిరుపతి, కాకినాడ టౌన్– కాచిగూడ– కాకినాడ టౌన్కా
కినాడ టౌన్–-లింగంపల్లి, కాచిగూడ– తిరుపతి– కాచిగూడ, సికింద్రాబాద్– నాగర్సోల్– -సికింద్రాబాద్, తిరుపతి– మచిలీపట్నం-– తిరుపతి, సికింద్రాబాద్– -అగర్తలా-– సికింద్రాబాద్, హైదరాబాద్– -జైపూర్– -హైదరాబాద్, కాచిగూడ– -లాల్ఘర్–-కాచిగూడ, కాచిగూడ– -హిస్సార్-కాచిగూడ, హైదరాబాద్– -ఘోరక్పూర్– -హైదరాబాద్, జాల్నా-– చాప్రా– జాల్నా, తిరుపతి– -షిర్టీసాయినగర్–- తిరుపతి,హైదరాబాద్– -రక్సెల్-– హైదరాబాద్, ధనాపూర్–- సికింద్రాబాద్– ధనాపూర్, సికింద్రాబాద్– -నిజాముద్దీన్–- సికింద్రాబాద్ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తామని తెలిపారు.
వచ్చే నెల 14 నుంచి పలు రైళ్లు రద్దు
సాత్నా మార్గంలో కొత్త రైల్వే లైన్పనులు జరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబరు 14 నుంచి 27 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రద్దయిన రైళ్లలో ధనాపూర్–- సికింద్రాబాద్– -ధనాపూర్, ముజఫర్ఘడ్–- సికింద్రాబాద్–-ముజఫర్ఘడ్, జాల్నా– -చాప్రా– -జాల్నా మార్గాల్లో నడుస్తున్న 10 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యమ్నాయం చూసుకోవాలని సూచించారు.