
వ్యాయామం చేసేందుకు 20-30 ఏళ్ల మధ్యవారే బద్ధకిస్తుంటారు. కానీ, ఓ 68 ఏళ్ల బామ్మ ఓపెన్ జిమ్‌లో ప్రతిరోజూ కసరత్తులు చేస్తున్నది. అన్ని పరికరాలపై వ్యాయామం చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నది. యువతరానికి ప్రేరణగా నిలుస్తున్నది.
ఆమె వయసు 68 ఏళ్లు. ఆమె ఇప్పటికి జిమ్‌లో భారీ వర్కౌట్లు చేస్తూ వృద్దాప్యంలో కూడా ఎంతో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారు. శరీరం ఫిట్‌గా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దగ్గరకు రావు. మనిషి ఫిట్నెస్గా ఉంటే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయగలడు. అయితే ఏ రంగంలో అయినా మనిషి రాణించాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి. ఈ క్రమంలో శారీరక శ్రమ, వ్యాయామం లాంటివి.. కొందరిలో పెరుగుతున్న వయస్సును బాహ్య ప్రపంచానికి కనిపించనివ్వవు. చాలామంది జిమ్‌లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు.
ప్రస్తుత కాలంలో మూడు పదుల వయస్సు వచ్చిందా సరే ఇక ఆపసోపాలు మొదలవుతాయి. కూర్చుంటే లేవలేరు.. లేస్తే కూర్చోలేరు. . ఇక కొందరు జిమ్ కెళ్లినా ఎక్కువ కష్ట పడలేరు.. అలాంటిది ఓ 68 ఏళ్ల బామ్మ మాత్రం భారీ వర్కౌట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురించేస్తుంది.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. కొత్త అభిరుచులను పెంపొందించడం ప్రారంభించడానికి ఇది ఎప్పుడూ ఆలస్యం కాదు. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య అని మనలో దాదాపు అందరూ గుర్తు చేసుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే ఆ సూత్రం ప్రకారం జీవిస్తారు.. ఆ వృద్దురాలు బరువైన వస్తువులు ఎత్తి వ్యాయామం చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. తేలికపాటి వ్యాయామాలతో పాటు బార్‌బెల్, డంబెల్స్ వంటి పరికరాలతో బరువులు ఎత్తడం చూడవచ్చు. . వృద్ధురాలు తన కొడుకు అజయ్ సాంగ్వాన్‌తో కలిసి జిమ్‌లో శిక్షణ తీసుకుంటోంది.
అయితే, 68 ఏళ్ల వయసులో తన ఫిట్‌నెస్ జర్నీని ప్రారంభించిన ఓ మహిళ వర్కవుట్ చేయడానికి వయస్సు ఎంతమాత్రం అడ్డంకి కాదని నిరూపించింది, ఆమె కుమారుడు @weightliftermummy పేరుతో ఆమె Instagram ఖాతాను కూడా నిర్వహిస్తున్నాడు, ఇప్పుడు 6,000 కంటే ఎక్కువ మంది ఆమెను ఫాలో అవుతున్నారు.. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయబడిన వివిధ వీడియోలలో, ఆమె ఉత్సాహంతో విపరీతమైన వ్యాయామాలు చేస్తూ కనిపిస్తుంది. డెడ్ లిఫ్ట్‌లు చేయడం నుండి స్క్వాట్‌లు, ప్లాంక్‌లు చేయడం వరకు, ఆమె అన్ని రకాల వ్యాయామాలను పరిపూర్ణ రూపంతో ప్రదర్శిస్తుంది..
ఆమె వీడియోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఆరు రోజుల క్రితం ( వార్తరాసే సమయానికి) ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 20 వేల వీక్షణలు వచ్చాయి. ఆమె వర్క్ అవుట్ చేయడం చూసి తాము స్ఫూర్తి పొందామని కొంతమంది చెప్పారు. ఆమె మెరుగైన రూపాన్ని కలిగి ఉంది, చాలా మంది .. మిమ్మల్ని మరియు మీ తల్లిని గౌరవించాలనుకుంటున్నారని ఒకరు రాశారు. నువ్వే నాకు స్ఫూర్తి అని మరొకరు రాశారు. భారతదేశానికి నీలాంటి కొడుకులు కావాలి.. తల్లితో వ్యాయామంలో పంచుకున్నందుకు థ్యాంక్యూ అని మెచ్చుకుంటున్నారు. మీ వయసులో ఏదైనా చేయాలనే ఆశను వదిలిపెట్టిన మీరు.. చుట్టూ ఉన్న వేలాది మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తారు.. అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఒక లుక్ వేసుకోండి.