శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు అధికారులు. మే 25వ తేదీ గురువారం ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో మస్కట్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద నుండి 685 గ్రాముల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు.
బంగారాన్ని పేస్ట్ లా మార్చి మలమూత్ర ద్వారం వద్ద అమర్చి తరలించే క్రమంలో పట్టుకున్నారు. పట్టుబడిని బంగారం సుమారు రూ.42 లక్షల 78 వేల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసుకున్న శంషాబాదర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మస్కట్ వచ్చిన వ్యక్తి మధ్యప్రదేశ్ కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. బంగారం ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నాడు..ఎవరికి అమ్ముతున్నడని పోలీసులు విచారిస్తున్నారు.