- 68 ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రమంజిల్పాఠశాల
- నిమ్స్ఆస్పత్రి విస్తరణ పేరుతో దారులు మూత
- కొత్త భవనాల నిర్మాణాలతో బడి తొలగింపు
- పేద విద్యార్థులకు ఇంగ్లిషు మీడియంలో బోధన
- కొత్త బిల్డింగ్ నిర్మించాకే తరలించాలని పూర్వ విద్యార్థులు డిమాండ్
పంజగుట్ట,వెలుగు : ఎర్రమంజిల్సర్కారు బడిలో చదివిన విద్యార్థులు ఎందరో ఉన్నతస్థాయికి ఎదిగారు. 68 ఏండ్ల చరిత్ర కలిగిన బడికి వెళ్లేందుకు ప్రస్తుతం దారిలేదు. త్వరలోనే బడి కూడా అక్కడ ఉండకపోవచ్చు. నిమ్స్ఆస్పత్రి విస్తరణలో భాగంగా చుట్టూ కట్టడాలు నిర్మించారు. దీంతో అన్ని వైపులా దారులను మూసేశారు.
అంతేకాకుండా బడి సమీపంలోని పెద్ద పెద్ద చెట్లను కూడా కొట్టేశారు. మరోవైపు ఆస్పత్రి విస్తరణ కారణంగా హైస్కూలుతో పాటు ప్రాథమిక పాఠశాలను కూడా తొలగించాల్సి పరిస్థితి నెలకొంది. అయితే ప్రత్యామ్నాయంగా మరోచోట విద్యార్థులకు భవనాలు నిర్మించి ఇచ్చాకే బడిని తొలగించాలని డిమాండ్ పూర్వ విద్యార్థుల నుంచి వస్తోంది. 2007 నుంచి ఇలాంటి పరిస్థితి ఉంది.
ఇంగ్లిషు మీడియం బోధన
ఈ బడిని1956లో ప్రారంభించారు. ప్రస్తుతం1 –5 వరకు ప్రాథమిక పాఠశాలలో 140 మంది ఉండగా.. హైస్కూలులో గతేడాది 216 మంది విద్యార్థులు ఇంగ్లిషు మీడియం చదివారు. ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతుండగా విద్యార్థుల సంఖ్య పెరగొచ్చు.
పూర్వ విద్యార్థులు వెళ్లి నిలదీయగా..
బడిని అక్కడి నుంచి తొలగిస్తారనే విషయం తెలియడంతో గురువారం పూర్వ విద్యార్థులు వెళ్లారు. నిమ్స్ఆస్పత్రి విస్తరణ కోసం అక్కడున్న చెట్లతోపాటు అడ్డుగా ఉన్న ఇతర భవనాలను తొలగిస్తున్నారు. ఇక బడిని తొలగిస్తే.. విద్యార్థుల పరిస్థితి ఏంటని పూర్వవిద్యార్థులు నిమ్స్అధికారులను ప్రశ్నించి నిలదీశారు.
పూర్వ విద్యార్థులు వెళ్లారనే సమాచారం తెలియడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్కోదండరాం, నిమ్స్ డైరెక్టర్ఎన్. బీరప్ప, ఖైరతాబాద్కార్పొరేటర్విజయారెడ్డి, ఎన్జీవో నుంచి శాంతాసిన్హా అక్కడికి వెళ్లి చర్చించారు.
ముఖ్యమంత్రితో మాట్లాడుతా..
విద్య అందరి హక్కు. పాఠశాల సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడతాను. సీఎంతోనే శంకుస్థానం చేయిస్తా. వచ్చే అకాడమిక్ ఇయర్ లోపు కొత్త భవనం నిర్మిస్తాం. దీనిపై పూర్వ విద్యార్థులు ఆందోళన చెందొద్దు.ఆర్అండ్ చీఫ్ ఇంజనీర్ గణపతిని పిలిచి అడిగారు.త్వరలోనే బడిని నిర్మించి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
– ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్
మూడునెలల్లో నిర్మించాలి
మూడు నెలల్లో కొత్త భవనం నిర్మించాలి. ఆ వెంటనే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. – టీజేఎస్ చీఫ్ ప్రొ. కోదండరాం