యాదాద్రి జిల్లాలో 69 డ్రంకెన్ ​డ్రైవ్ ​కేసులు

యాదాద్రి, వెలుగు: న్యూ ఇయర్ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి యాదాద్రి జిల్లాలోని వేర్వేరుచోట్ల ట్రాఫిక్​పోలీసులు డ్రంకెన్​డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. పలువురు మద్యం మత్తులో వెహికల్స్ నడుపుతూ పోలీసులకు చిక్కారు. జిల్లా వ్యాప్తంగా 69 కేసులు నమోదయ్యాయి. భువనగిరి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 25, చౌటుప్పల్ పీఎస్​పరిధిలో 25, యాదగిరిగుట్ట పీఎస్ పరిధిలో19 కేసులు నమోదయ్యాయి. వెహికల్స్​ను సీజ్ చేశారు. ఇందులో 8 కార్లు, మిగిలినవన్నీ టూవీలర్సే అని పోలీసులు తెలిపారు.