జోరందుకున్న నామినేషన్లు .. కరీంనగర్ జిల్లాలో 69 నామినేషన్లు 

కరీంనగర్ టౌన్, పెద్దపల్లి, జగిత్యాల, : ఉమ్మడి కరీంనగర్​జిల్లా వ్యాప్తంగా బుధవారం 69 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో రిటర్నింగ్​ఆఫీసుల వద్ద సందడి నెలకొంది. కరీంనగర్​  జిల్లాలో 20, జగిత్యాలలో 21, పెద్దపల్లిలో 21, రాజన్నసిరిసిల్లలో 7 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో  మంత్రి గంగుల కమలాకర్(బీఆర్ఎస్) 2 సెట్లు, అంబటి జోజిరెడ్డి(ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్), పురుమళ్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(కాంగ్రెస్), హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వొడితెల ప్రణవ్(కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), గంగారపు తిరుపతి(పీపుల్స్ పార్టీ), ఈటల  రాజేందర్(బీజేపీ), చొప్పదండిలో సుంకె రవిశంకర్(బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), బొడిగె శోభ(బీజేపీ), బంగారి మాధవ(పిరమిడ్ పార్టీ), మానకొండూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరెపల్లి మోహన్(బీజేపీ)2 సెట్లు, కవ్వంపల్లి సత్యనారాయణ(కాంగ్రెస్) ​నామినేషన్​ వేశారు.  

రాజన్నసిరిసిల్ల జిల్లా.. సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి(కాంగ్రెస్) తరఫున కాముని వనిత, స్వతంత్ర అభ్యర్థులు లగిశెట్టి శ్రీనివాస్, తాటిపాములు శ్రీనివాస్, రాణిరుద్రమ(బీజేపీ) తరఫున ఆడేపు రవీందర్, వేములవాడ నుంచి -తుల ఉమ(బీజేపీ) తరఫున మహమ్మద్ ఇక్బాల్, గడ్డం హరీశ్​(ధర్మ సమాజ్)నామినేషన్లు వేశారు.   

పెద్దపల్లి జిల్లాలో..పెద్దపల్లి నుంచి డిల్లేశ్వర్​రెడ్డి (పిరమిడ్​ పార్టీ), గుంటి కుమారస్వామి (యుగతులసి, ఫార్వర్డ్​బ్లాక్​,  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీపీల నుంచి), కందుల సదానందం (2 బీజేపీ, ఇండిపెండెంట్​), రామగుండం నుంచి సోమారపు సత్యనారాయణ (ఇండిపెండెంట్​), మంథనిలో పుట్ట మధుకర్​ (బీఆర్ఎస్​), చందుపట్ల సునీల్​రెడ్డి (బీజేపీ), చల్ల సుజాత (బీఎస్పీ), చిట్యాల శ్రీనివాస్​ (ధర్మసమాజ్​ పార్టీ), దుద్దిళ్ల శ్రీధర్​బాబు (కాంగ్రెస్​ సెకండ్​ సెట్​), చల్ల నారాయణరెడ్డి ( బీఎస్పీ, సెకండ్​ సెట్​) నామినేషన్  ​వేశారు. 

జగిత్యాల జిల్లాలో.. జగిత్యాల నియోజకవర్గంలో ఏడుగురు నామినేషన్లు వేయగా, బందరి శ్రావణి(బీజేపీ) నామపత్రాలు అందజేశారు. కోరుట్లలో డి.అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(బీజేపీ), కె.సంజయ్(బీఆర్ఎస్), సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు(బీఆర్ఎస్), జువ్వాడి నర్సింగారావు(కాంగ్రెస్), ధర్మపురిలో ఎస్. కుమార్(బీజేపీ), లక్ష్మణ్ కుమార్(కాంగ్రెస్), 
నక్క విజయ్ కుమార్(బీఎస్పీ), 13 మంది ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నామినేషన్లు వేశారు.

భారీ ర్యాలీతో లగిశెట్టి నామినేషన్

రాజన్నసిరిసిల్ల, వెలుగు :  సిరిసిల్ల నుంచి లగిశెట్టి శ్రీనివాస్(ఇండిపెండెంట్​)  బుధవారం భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11 గంటలకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్డీవో ఆఫీస్ వరకు కొనసాగింది. డప్పు చప్పుళ్లతో సుమారు 10 వేల మంది ర్యాలీలో పాల్గొన్నారు. ​ర్యాలీతో అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్  జామ్​ అయ్యింది.