ములుగు జిల్లా.. వెంకటాపూర్​లో 69.4 సెంటీమీటర్ల వర్షపాతం

గురువారం ములుగు జిల్లా వెంకటాపూర్​లో అత్యధికంగా 69.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1996 జూన్​ 17న ఖమ్మం జిల్లా కోయిడాలో నమోదైన 67.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్​ను ఇది బ్రేక్​ చేసింది. ఇక, గురువారం భూపాలపల్లి జిల్లా చిట్యాలలోనూ 61.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.

ALSO READ:హైకోర్టులో వనమాకు చుక్కెదురు.. ఎన్నిక చెల్లదన్న తీర్పుపై స్టేకు నో

 ఆ తర్వాత హనుమకొండ జిల్లా పరకాల మండలంలో 45.9, నిర్మల్ జిల్లా  భైంసాలో  25.92,  జనగామ జిల్లా జఫర్​గడ్ మండలంలో 19.8, సిద్దిపేట జిల్లా   హుస్నాబాద్ లో 18.66, పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో 17.51,  యాదాద్రి జిల్లా  అడ్డగూడూరు, గుండాలలో 10.8,  కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో 10 సెంటీమీటర్ల వాన కురిసింది.