
అమరావతి : 24 గంటల్లో ఏపీలో 1,08,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా .. 6,952 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని తెలిపింది ఏపీ వైద్యారోగ్య శాఖ. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,03,074 మందికి కరోనా వైరస్ సోకిందని. ఒక్కరోజే కరోనా బారిన పడి 58 మంది మృత్యువాతపడ్డారని తెలిపింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,882కు చేరిందని. గడిచిన 24 గంటల్లో 11,577 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 16 లక్షల 96 వేల 880 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఏపీలో ప్రస్తుతం 91,417 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. రాష్ట్రంలో నేటి వరకు 2,03,48,106 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారని తెలిపింది వైద్యారోగ్యశాఖ.