నవోదయలో ఆరో తరగతి ఎంట్రెన్స్​

దేశవ్యాప్తంగా 649 జవహర్‌‌‌‌ నవోదయ విద్యాలయ (జేఎన్‌‌‌‌వీ)లో ఆరో తరగతిలో అడ్మిషన్స్​కు నోటిఫికేషన్​ రిలీజ్​ అయింది. ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌‌‌‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు.

అర్హత: విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2022-–23 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి.

ఎగ్జామ్ ప్యాటర్న్​: జవహర్‌‌‌‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు(మెంటల్‌‌‌‌ ఎబిలిటీ, అర్థమెటిక్‌‌‌‌, లాంగ్వేజ్‌‌‌‌) ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌‌‌‌ 29న పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.navodaya.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.