
ఆరో షెడ్యూల్లో నాలుగు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలోని గిరిజన ప్రాంతాల పరిపాలన కోసం ప్రత్యేక నిబంధనలను కలిగి ఉంది. ప్రస్తుతం (2002) పైన పేర్కొన్న నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 10 గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. 244ఏ అస్సాంలోని కొన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా స్వయం ప్రతిపత్తి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, దాని కోసం స్థానిక శాసనసభని లేక మంత్రిమండలిని లేక ఆ రెండింటినీ ఏర్పాటు చేయడం.
రాజ్యాంగంలోని పదో భాగం ఆర్టికల్ 244 షెడ్యూల్డ్ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలుగా పేర్కొన్న కొన్ని ప్రాంతాలకు పరిపాలన వ్యవస్థ గురించి తెలుపుతుంది. ఐదో షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం అనే నాలుగు రాష్ట్రాలు మినహా ఏ రాష్ట్రంలోనైనా షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగల పరిపాలన, నియంత్రణకు సంబంధించింది. 2022 నాటికి 10 రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయి. అవి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్. ఆర్టికల్ 339 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ కలిగి ఉంటుంది.
షెడ్యూల్డ్ ప్రాంతాల ప్రకటన: ఆర్టికల్ 241(1) ప్రకారం గవర్నర్‌తో సంప్రదించి ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంది. రాష్ట్రపతి ఆ ప్రాంత భూభాగాన్ని పెంచవచ్చు. లేదా తగ్గించవచ్చు. సరిహద్దు రేఖలను మార్చవచ్చు. హోదాను రద్దు చేయవచ్చు. లేదా సంబంధిత రాష్ట్ర గవర్నర్‌తో సంప్రదించి ఒక ప్రాంతంపై పున:రూపకల్పన కోసం తాను ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
గిరిజన సలహా మండలిని సంప్రదించిన తర్వాత షెడ్యూల్డ్ చేయబడిన ప్రాంతం శాంతి, ఉత్తమ ప్రభుత్వం కోసం నిబంధనలూ చేయవచ్చు. అలాంటి నియంత్రణ పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభకు సంబంధించిన ఏదైనా చట్టాన్ని రద్దు చేయవచ్చు. లేదా సవరించవచ్చు. ఇది షెడ్యూల్డ్ చేయబడిన ప్రాంతానికి వర్తిస్తుంది. కానీ అలాంటి నిబంధనలన్నింటికీ రాష్ట్రపతి ఆమోదం అవసరం. షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన, రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై నివేదిక ఇవ్వడానికి రాష్ట్రపతి ఒక కమిషన్ నియమించవచ్చు. మొదటి కమిషన్ దేభార్ నేతృత్వంలో ఏర్పడి 1961లో నివేదిక ఇచ్చింది. 2002లో నియమించబడిన రెండో కమిషన్ దిలీప్ సింగ్ భూరియా నేతృత్వంలో ఏర్పడి 2004లో నివేదిక ఇచ్చింది.
రాష్ట్ర, కేంద్ర కార్యనిర్వాహక అధికారం: రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం అందులోని షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించి ఉంటుంది. అలాంటి ప్రాంతాలపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఉంటుంది. ఆ ప్రాంతాల పరిపాలనకు సంబంధించి, ఏటా లేదా అవసరమైనప్పుడు గవర్నర్ రాష్ట్రపతికి నివేదికను సమర్పిస్తారు. కేంద్ర కార్యనిర్వహక అధికారం అలాంటి ప్రాంతాల పరిపాలనకు సంబంధించి రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడానికి విస్తరించింది.
సలహా మండలి: షెడ్యూల్ చేసిన ప్రాంతాలను కలిగి ఉన్న ప్రతి రాష్ట్రంలో ఈ మండలి ఏర్పడుతుంది. షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, అభ్యున్నతిపై సలహాలు ఇవ్వడం దీని ముఖ్యవిధి. ఇది 20 మంది సభ్యులను కలిగి ఉంటుంది. వీరిలో 3/4 వంతు మంది రాష్ట్ర శాసనమండలిలో ఎస్టీలు ప్రతినిధులుగా ఉండాలి.
షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తించే చట్టం: పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ ఏదైనా నిర్దిష్ట చట్టం షెడ్యూల్డ్ చేయబడిన ప్రాంతానికి వర్తించదని లేదా పేర్కొన్న మార్పులు, మినహాయింపులు వర్తించవని ఆదేశించే అధికారం గవర్నర్‌కు ఉంది.
పన్ను రాబడి సేకరణ: జిల్లా, ప్రాంతీయ కౌన్సిల్ భూ ఆదాయాన్ని అంచనా వేయడానికి, సేకరించడానికి, నిర్దిష్ట పన్నులను విధించడానికి అధికారం కలిగి ఉంటాయి. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ చట్టాలు స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లాలు, స్వయంప్రతిపత్తి ప్రాంతాలకు వర్తించవు. లేదా పేర్కొన్న మార్పులు, మినహాయింపులతో వర్తించవు. స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లాలు లేదా ప్రాంతాల పరిపాలనకు సంబంధించి ఏదైనా విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వడానికి గవర్నర్ ఒక కమిషన్ నియమించవచ్చు. ఇటీవల రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 (ఫైనాన్స్ కమిషన్) ఆరో షెడ్యూల్డ్‌కు మైలురాయి వంటి సవరణను మంత్రివర్గం ఆమోదించింది. ఈ సవరణలు అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని స్వయంప్రతిపత్తి జిల్లాల కౌన్సిల్ ఆర్థిక వనరులు, అధికారాలను గణనీయంగా మెరుగుపరుస్తాయి.
ఆరో షెడ్యూల్ నిబంధనలు
స్వయం ప్రతిపత్తి జిల్లాలు: ఈ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలు స్వయంప్రతిపత్తి జిల్లాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో ప్రతి ఒక్కటి స్వయంప్రతిపత్తి జిల్లా కౌన్సిల్‌ను కలిగి ఉంది. ప్రతి స్వయం ప్రతిపత్తి ప్రాంతం 30 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక ప్రాంతీయ మండలిని కలిగి ఉంది. (26 మంది ఐదేండ్ల కాలానికి వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నికవుతారు. నలుగురు గవర్నర్‌తో నామినేట్ చేయబడతారు. ప్రస్తుతం ఇలాంటి కౌన్సిళ్లు 10 ఉన్నాయి)
శాసనాధికారం: భూమి, అడవులు, కాలువ నీరు, సాగులోకి మారడం, గ్రామ పరిపాలన, ఆస్తి వారసత్వం, వివాహం, విడాకులు మొదలైన కొన్ని నిర్దిష్ట విషయాలపై గవర్నర్ ఆమోదంతో చట్టాలు చేయడం.
న్యాయపరమైన అధికారం: ఈ సూట్లు, కేసులపై హైకోర్టు అధికార పరిధిని గవర్నర్‌తో పేర్కొనబడిన తెగల మధ్య దావాలు, కేసులు విచారణ కోసం కౌన్సిళ్లు గ్రామసభలు లేదా కోర్టులను ఏర్పాటు చేయగలవు.
నియంత్రణాధికారం: జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు, డిస్పెన్సరీలు, మార్కెట్లు మొదలైన వాటిని జిల్లా కౌన్సిల్ ఏర్పాటు చేయవచ్చు. నిర్మించవచ్చు లేదా నిర్వహించవచ్చు. ఇది గిరిజనేతరులు రుణాలు ఇవ్వడం, వ్యాపారం చేయడంపై నియంత్రణ కోసం కూడా నిబంధనలను రూపొందించవచ్చు. అయితే ఇలాంటి నిబంధనలకు గవర్నర్ ఆమోదం అవసరం.