ఎండోస్కోపీతో బయటకు తీసిన డాక్టర్
ఖమ్మం టౌన్, వెలుగు : ఆరేండ్ల బాలుడు ఆడుకుంటూ ఇనుప బోల్టు మింగాడు. డాక్టర్ ఎండోస్కోపీ చేసి బోల్టును బయటకు తీసి బాలుడి ప్రాణం కాపాడారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం హర్యాతండాలో శనివారం ఈ ఘటన జరిగింది. తండాకు చెందిన బాదావత్ రమేశ్, మంజుల దంపతుల కొడుకు హర్ష (6) తోటి పిల్లలతో ఆడుకుంటూ శనివారం ఇనుప బోల్టు మింగాడు.
గుర్తించిన అతని తల్లిదండ్రులు.. సిటీలోని మయూరి సెంటర్లో ఉన్న జంగాల గ్యాస్ట్రో హాస్పిటల్కు పిల్లాడిని తీసుకెళ్లారు. డాక్టర్ జంగాల సునీల్ కుమార్ ఎండోస్కోపీ చేసి బోల్టును బయటకు తీసి బాబు ప్రాణాలు కాపాడారు.