
కురవి, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో కరెంట్ షాక్ తో 7 బర్రెలు మృతి చెందాయి. ముత్యాలమ్మ కుంట పైభాగంలోని కరెంట్ స్థంభంపై నుంచి ఒక వైరు కిందికి వాలిఉంది. మేతకు వెళ్ళిన బర్రెలు వేలాడుతున్న తీగకు తాకాయి. దీంతో కాట్యాల మల్లయ్య కు చెందిన 5 బర్రెలు ,కాకి వెంకట్ రెడ్డికి చెందిన ఒక బర్రె ,కానుగంటి మల్లయ్య కు చెందిన బర్రె మృత్యువాత పడ్డట్లు బాదితులు తెలిపారు. కరెంట్ అధికారుల నిర్లక్ష్యంగా కారణంగానే మృతి చెందాయని తమకు నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు.