
కొత్త కార్లు కొనాలనుకునే వారికి పిడుగు లాంటి వార్త చెప్పాయి కార్ల తయారీ సంస్థలు. 2025, ఏప్రిల్ 1వ తేదీ నుంచి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు 7 సంస్థలు ప్రకటించాయి. మెటీరియల్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు పెరగడంతో తప్పని పరిస్థితుల్లో కార్ల ధరలను పెంచాలని నిర్ణయించినట్లు తయారీ సంస్థలు పేర్కొన్నాయి. భారత కార్ మార్కెట్లో అగ్ర సంస్థలైన మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కంపెనీలు ధరలు పెంచిన జాబితాలో ఉన్నాయి. వీటితో పాటుగా కియా, బీఎండబ్ల్యూ, రెనాల్ట్, హోండా కంపెనీలు కూడ కార్ల ధరలను హైక్ చేస్తోన్నట్లు ధృవీకరించాయి.
ధరల పెరుగుదల మోడల్స్, వాటి వేరియంట్‌లపై ఆధారపడి ఉంటుందని తెలిపాయి. 2025, ఏప్రిల్ 1 నుంచి కార్ల పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. కార్ తయారీ సంస్థల ప్రకటనతో వచ్చే నెలలో కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు అలర్ట్ అయ్యారు. ఏప్రిల్ 1కు మరో 10 రోజుల సమయం ఉండటంతో ఇలోపే కార్లు కొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో మార్చి నెలలో కార్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ALSO READ | ఇట్లయితే ఇండియాలో వ్యాపారం చేసుకోలేం..మోదీ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన ఎలాన్ మస్క్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ వివిధ మోడళ్లపై 3 నుంచి 4 శాతం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. టాటా మాత్రం కార్ల ధరలు పెంచుతున్నట్లు ధృవీకరించింది కానీ ఎంత మేర హైక్ చేస్తామని విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఇక, హ్యుందాయ్ 3 శాతం మేర ధరల పెరుగుదల ఉంటుందని తెలిపింది. హ్యుందాయ్ బాటలోనే కియా కంపెనీ కూడా 3 శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అదే విధంగా బీఎండబ్ల్యూ కూడా వివిధ మోడళ్లపై 3 శాతం రేట్స్ హైక్ చేస్తోన్నట్లు తెలిపింది. రెనాల్ట్ కంపెనీ 2 శాతం మేర ధరలు పెంచుతున్నట్లు ధృవీకరించింది.
ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగే కార్లు ఇవే..:
- ఏప్రిల్ నుండి 3 శాతం మేర కార్ల ధరలు పెంచనున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది. క్రెటా, వెర్నా, వెన్యూ, టక్సన్ వంటి కార్లు ధరలు పెంచినట్లు తెలిపింది.
- సెల్టోస్ , సోనెట్, సైరోస్ , EV6 , EV9 , కారెన్స్, కార్నివాల్ వంటి కార్లపై 3 శాతం ధరలు పెంచుతున్నట్లు అనౌన్స్ చేసింది.
- ఏప్రిల్ నుంచి BMW మినీ కార్ల ధరలు 3 శాతం వరకు పెరుగుతాయని కంపెనీ వెల్లడించింది. ధరలు పెరిగే వాటిలో BMW 3 సిరీస్ LWB , iX1 LWB , M5, X7 మోడళ్లు ఉన్నాయి. మినీ కూపర్ S మరియు కంట్రీమాన్ ఎలక్ట్రిక్ కూడా ఖరీదైనవిగా మారతాయని వెల్లడించింది
- క్విడ్ , కిగర్, ట్రైబర్ -మూడు మోడళ్లపై 2 శాతం వరకు ధరలు పెరుగుతాయని రెనాల్ట్ కంపెనీ తెలిపింది.
- అమేజ్, సిటీ, సిటీ ఇ:హెచ్‌ఇవి, ఎలివేట్‌తో సహా అన్ని మోడళ్ల ధరల పెరుగుతాయని హోండా కంపెనీ ప్రకటించింది.