
అబుజా: నైజీరియాలో ఓ బిల్డింగ్ కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రమైన గాయాలయ్యాయి. శనివారం అబుజాలోని సబోన్ లుగ్బే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అనుమతులు లేని భవనాలను అబుజా అధికారులు కూల్చేశారు.
ఈ క్రమంలోనే సబోన్ లుగ్బే ప్రాంతంలోని బిల్డింగ్‌ను పాక్షికంగా కూలగొట్టారు. అయితే, పునాది నుంచి స్క్రాప్ మెటల్‌ను తీయడానికి స్కావెంజర్లు ప్రయత్నించడంతో అది పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందిన వెంటనే ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి శిథిలాల కింద నుంచి ఐదు మృతదేహాలను వెలికితీశారు.