హైదరాబాద్ ఎల్బీ నగర్లో దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు..

హైదరాబాద్ ఎల్బీ నగర్లో దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు..

హైదరాబాద్ లో దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ కేంద్రంగా సాగుతున్న దొంగనోట్ల మాఫియా ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శనివారం ( మార్చి 15 ) దొంగనోట్ల చలామణి చేస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ముఠా 1:4 రేషియోతో నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ కి చెందిన మాణిక్య రెడ్డి తన భార్య మరణించినప్పటి నుండి.. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలో మాణిక్య రెడ్డికి అహ్మదాబాద్ కి చెందిన సురేష్ భాయ్ తో పరిచయం అయ్యింది. మాణిక్య రెడ్డి పరిస్థితి తెలుసుకున్న సురేష్ భాయ్ అతన్ని దొంగనోట్ల రాకెట్ లోకి దించాడు. హైదరాబాద్ నుంచి రూ. లక్షతో వెళ్లిన మాణిక్య రెడ్డి అహ్మదాబాద్ నుండి రూ. 11లక్షల దొంగానోట్లతో తిరిగొచ్చాడు. తన ఫ్రెండ్స్ ని ఈ రాకెట్ లోకి దించితే కమీషన్ ఇస్తానని సురేష్ భాయ్ ఆఫర్ ఇవ్వడంతో తన స్నేహితులను కూడా దొంగనోట్ల రాకెట్ లోకి దించాడు మాణిక్య రెడ్డి.

రూ. లక్షకు రూ. 4లక్షలు దొంగనోట్లు ఇచ్చేలా తన స్నేహితులకు, సురేష్ భాయ్ కి డీల్ సెట్ చేసాడు మాణిక్య రెడ్డి. మొత్తానికి ఈ వ్యవహారం పోలీసులకు తెలియడంతో మాణిక్య రెడ్డి,తన స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దొంగనోట్ల ముఠా సూత్రధారి సురేష్ భాయ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సురేష్ భాయ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.