గోద్రెజ్​నుంచి 7 హోం లాకర్లు

గోద్రెజ్​నుంచి 7 హోం లాకర్లు

 

హైదరాబాద్​, వెలుగు:  సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే గోద్రెజ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ హైదరాబాద్‎లో కొత్తగా ఏడు హోం లాకర్లను విడుదల చేసింది. వీటి ధరలు రూ.ఎనిమిది వేల నుంచి రూ.రెండు లక్షల వరకు ఉంటాయి.  వీటిలో బయోమెట్రిక్ యాక్సెస్, హిడెన్ స్టోరేజ్, ఇంటెలిజెంట్ అలారం సిస్టం వంటి ఫీచర్లు ఉంటాయి. వచ్చే మూడేళ్లలో తెలంగాణలో హోమ్ లాకర్ సెగ్మెంట్ 18 శాతం వృద్ధి చెందవచ్చని గోద్రెజ్​ తెలిపింది. రాబోయే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలో కంపెనీ 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో హైదరాబాద్ వాటా 52 శాతంగా ఉండనుంది. 

హోమ్ లాకర్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌కి సంబంధించి జాతీయ స్థాయిలో కంపెనీకి సుమారు 75 శాతం మార్కెట్ వాటా ఉంది.  దేశవ్యాప్తంగా తన మార్కెట్ వాటాను 80 శాతానికి పెంచుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. తమ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,100 కోట్ల రెవెన్యూను సాధించిందని, ఈసారి రూ.1,500 కోట్లను టార్గెట్‎గా పెట్టుకున్నామని గోద్రెజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ బిజినెస్ విభాగం బిజినెస్ హెడ్  పుష్కర్ గోఖలే తెలిపారు.