వరల్డ్ కప్ ఓడిపోవడంతో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు..7గురు విద్యార్థులపై కేసు నమోదు

వరల్డ్ కప్ ఓడిపోవడంతో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు..7గురు విద్యార్థులపై కేసు నమోదు

2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి ప్రతి భారతీయుడిని కలచి వేస్తుంది. సొంతగడ్డపై మన జట్టు అతనిని అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ లో అనూహ్యంగా ఓడిపోవడంతో దేశమంతా విచారం వ్యక్తం చేశారు. 12 ఏళ్ళ తర్వాత  వరల్డ్ కప్ కొడదామనుకున్నా.. ఆసీస్ ఆ అవకాశం భారత్ కి ఏ దశలోనూ ఇవ్వలేదు. అయితే భారత్ ఓడిపోయినప్పటికీ అభిమానులు టీమిండియాకు మద్దతుగా నిలిచారు. కానీ కాశ్మీర్ విద్యార్థులు మాత్రం భారత వ్యతిరేక నినాదాలు చేపట్టారు. 

ఈ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం చవిచూడడంతో కాశ్మీర్ విద్యార్థులు భారత వ్యతిరేక నినాదాలు చేశారని గందర్‌బల్ పోలీసులు ఆరోపించారు. కశ్మీర్ యూనివర్శిటీకి చెందిన 7 మంది విద్యార్థులపై గందర్‌బల్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 317/2023 గా నమోదు చేయబడింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రేరేపించడం కారణంగా వీరికి సెక్షన్ 13 UAPA విధించబడింది.

పోలీసులు వీరిపై  'ప్రజా దుర్మార్గం', 'నేరపూరిత బెదిరింపు' కారణంగా IPC 505, 506 సెక్షన్‌లను కూడా విధించారు. 7 మంది విద్యార్థులపై ఎలాంటి సెక్షన్‌ల కింద బుక్ చేశారో పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఈ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 241 పరుగులు చేయగా.. ఆసీస్ ఈ లక్ష్యాన్ని మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించి మ్యాచ్ ను ముగించింది. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వీరోచిత సెంచరీతో మ్యాచ్ ను భారత్ దగ్గర నుంచి లాగేసుకున్నాడు.