లోయలో పడ్డ బస్సు…ఏడుగురి మృతి

లోయలో పడ్డ బస్సు…ఏడుగురి మృతి

ఒడిశాలోని గంజాం జిల్లా పట్టాపూర్‌ తప్తపాణి ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా… దాదాపు 40 మంది గాయపడ్డారు.

స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.