చెన్నై : తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో క్రాకర్స్ తయారీ యూనిట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి బిల్డింగ్ కుప్పకూలింది. భవనం లోపలు పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు.
మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బిల్డింగ్ లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.