
కరీంనగర్: కరీంనగర్ టౌన్లో రాజీవ్ చౌక్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా భారీగా నగదు పట్టుబడింది. సుమన్ కళ్యాన్ అనే వ్యక్తి వద్ద సరియైన ఆధారాలు లేకుండా రూ.7లక్షల నగదును తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. ఎన్నికల్ కోడ్ అమలులో ఉన్నందున కరీంనగర్ పట్టణంలో ఇప్పటివరకు సరైన ఆధారాలు లేని రూ. 15 లక్షల 81వేల 900 లనగదును పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.