ఏడుగురు మావోయిస్టులు అరెస్ట్‌‌‌‌

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా చింతగుఫా పోలీసులు బుధవారం ఏడుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... జిల్లాలోని మెట్టగూడ బేస్‌‌‌‌ క్యాంప్‌‌‌‌నకు చెందిన 203 సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ జవాన్లు దుల్లేడు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌‌‌‌ చేస్తున్నారు. ఈ టైంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. 

దీంతో వారు మావోయిస్ట్‌‌‌‌ పార్టీకి చెందిన సోడె హిడ్మా, మడవి చందు, మడకం భీమా, సోడె సోమ్డా, సోడె బుధారం, సోడె కోసా, మడకం హిడ్మాగా తేలింది. వీరిపై అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2024లో సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ జవాన్లను తరలించే వాహనాన్ని అడ్డుకుని తగులబెట్టినట్లు చింతగుఫా పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో కేసు నమోదైంది. ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌‌‌‌కు  తరలించినట్లు చెప్పారు.

నలుగురు మావోయిస్టులు లొంగుబాటు

నారాయణపూర్‌‌‌‌ జిల్లా పోలీసుల ఎదుట బుధవారం నలుగురు కీలక మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో అరబ్‌‌‌‌ అలియాస్‌‌‌‌ కమలేశ్‌‌‌‌ నెల్‌‌‌‌నార్‌‌‌‌ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేయగా, మైనూ అలియాస్‌‌‌‌ హేమ్లా కుర్రం, రంజిత్‌‌‌‌ లొకామీ, కోసి అలియాస్‌‌‌‌ కవితలు 2010 ఏప్రిల్‌‌‌‌ 6న తాటిమెట్లలో 76 మంది సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ జవాన్లను చంపిన దాడిలో పాల్గొన్నారు. ఈ నలుగురిపై రూ.32 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.