ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు,మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నర్సంపేట ఏరియా కమాండర్ భద్రుతో సహా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిల్స్ తో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతులు
- కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న
- ఈ గోలపు మల్లయ్య అలియాస్ మధు
- ముస్సాకి దేవల్అలియాస్ కరుణాకర్
- ముస్సాకి జమున
- జైసింగ్, పార్టీ సభ్యుడు
- కిషోర్, పార్టీ సభ్యుడు
- కామేష్, పార్టీ సభ్యుడు
మావోయిస్టుల ఏరివేత దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే..ఇటీవలే నవంబర్ 22 చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో 10 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.