ఆప్షన్స్ ట్రేడింగ్ తగ్గించేందుకు 7 ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌

ఆప్షన్స్ ట్రేడింగ్  తగ్గించేందుకు 7 ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండెక్స్‌‌‌‌‌‌‌‌, స్టాక్ ఆప్షన్స్ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌లో చిన్న ఇన్వెస్టర్లను కాపాడేందుకు సెబీ ఏర్పాటు చేసిన ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్ కమిటీ ఏడు ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. ఇన్వెస్టర్లను కాపాడేందుకు షార్ట్ టెర్మ్ స్ట్రాటజీలను రికమండ్ చేస్తోంది. వీక్లి ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌కు పరిమితులు విధించడం లేదా రేషనలైజ్ (సమర్ధవంతంగా) చేయడం, స్ట్రైక్ ప్రైస్‌‌‌‌‌‌‌‌లను రేషనలైజ్ చేయడం, ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరి రోజు క్యాలెండర్ స్ప్రెడ్స్‌‌‌‌‌‌‌‌తో వచ్చే బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ను తొలగించడం వంటి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌పై నిపుణులు చర్చిస్తున్నారు. 

ఆప్షన్‌‌‌‌‌‌‌‌ బయ్యర్ల నుంచి ముందుగానే ఆప్షన్‌‌‌‌‌‌‌‌ ప్రీమియం సేకరించడం, ఇంట్రాడే పొజిషన్లకు లిమిట్‌‌‌‌‌‌‌‌ పెట్టడం, లాట్ సైజ్‌‌‌‌‌‌‌‌లను పెంచడం, ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరికి దగ్గరవుతున్నప్పుడు మార్జిన్ అవసరాలను పెంచడం వంటి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ను కూడా ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్ కమిటీ ప్రతిపాదించింది.