AI టచ్ చేయలేని ఏడు టెక్ ఉద్యోగాలు ఇవే..

AI  టచ్ చేయలేని ఏడు టెక్ ఉద్యోగాలు ఇవే..

AI  టెక్నాలజీ వచ్చినతర్వాత టెక్ రంగంలో భారీ ప్రభావం ఉంటుందని.. ఏఐతో ఉద్యోగాలు పోతాయని.. ఇక టెక్ ఎంప్లాయీస్ పని అయిపోయిందని, ఇక టెకీలకు తిప్పలు ప్రచారం జోరుగా సాగింది. దీంతో టెకీలు భయాందోళనకు గురయ్యారు కూడా. అయితే టెక్ రంగంలో అన్ని ఉద్యోగాలకు AI  టెక్నాలజీ ముప్పు ఉందా.. ఉంటే ఏయే ఉద్యోగాలకు ఎక్కువగా ఉంది. టెకీల భయానికి అతీతంగా అంతర్గతంగా దాగి నిజాలను వెలికితీద్దాం.. కొన్ని రకాల టెక్ ఉద్యోగాలపై AI  టెక్నాలజీ ఎలాంటి ప్రభావం చూపదని తేలుస్తోంది. అవేంటో చూద్దాం..

డేటా సైంటిస్ట్.. 

AI డేటాను నిర్వహించగలిగినప్పటికీ దానిని వ్యూహాత్మకంగా అర్థం చేసుకునేందుకు తప్పకుండా ఎప్లాయీస్ అవసరం తప్పనిసరి.అంటే టెకీల అవసరం కంపల్సరీ అన్నమాట..

సైబర్ సెక్యురీటీ నిపుణుడు: 

AI సైబర్ సెక్యూరిటీ హెచ్చరికలను జారీ చేయగలదు కానీ.. అర్హత గల స్పెషలిస్టు మాత్రమే సేఫ్ నెట్ వర్క్ నిర్మించగలడు..నిర్వహించగలడు. దీనిలో మానవ ప్రమేయం తప్పనిసరి. 

సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ మేనేజర్: 

AI కోడింగ్ కు సపోర్ట్ చేయగలదు కానీ.. సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ సమర్థవంతమైన, అవసరమైన సృజనాత్మకతను అందించలేదు. 

క్లౌడ్ ఆర్కిటెక్ : 

క్లౌడ్ మేనేజ్ మెంట్, స్ట్రక్చరింగ్ అనేది చాలా క్లిష్టమైనది. ఇందులో మానవ జోక్యం తప్పనిసరి.. సరైన నిర్ణయం అవసరం కాబట్టి క్లౌడ్ ఆర్కిటెక్ ఉద్యోగాలకు AI తో ఎలాంటి ప్రమాదం లేదు.  

సిస్టమ్స్ అనలిస్ట్: 

సిస్టమ్ పనితీరును అర్థం చేసుకోవడం, దానిని మెరుగు పర్చడానికి సిస్టమ్ అనలిస్ట్ సామర్థ్యాన్ని AI సమర్థవంతంగా నిర్వహించలేదు.. 

UX డిజైనర్ : 

UX డిజైన్ లో మానవ ప్రమేయం వినియోగదారుడి ప్రవర్థన, ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలదు.. కానీ AI ఆ ప్రావీణ్యం రాలేదు. 

టెక్నికల్ ప్రొగ్రామ్ మేనేజర్: 

సోర్స్ ను మేనేజ్ చేయడం, టైమ్ లైన్ నిర్వహణ, వివిధ టెక్నికల్ టీమ్ లను సంధానించడం.. ఇది మానవ ప్రమేయం లేకుండా సాధ్యం కాదు. కాబట్టి టెక్నికల్ ప్రొగ్రామ్ మేనేజర్ ఉద్యోగాలకు AI వల్ల ఎలాంటి ఢోకా లేదు. 

AI బూమ్ కొనసాగుతున్న నేపథ్యంలో టెక్ ఉద్యోగాలకు మానవ చాతుర్యం, సృజనాత్మకత, వ్యూహాత్మక ఆలోచన, సాంకేతికత లాంటి మేనేజ్ చేయడం AI కి సాధ్యం కాదు.. ఈ బలమైన కారణాల చేత టెక్ ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది లేదని తేలుస్తోంది..