తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ, ఇంగ్లీష్..ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. ఇక ఇపుడొచ్చే శుక్రవారం ఒక్కటే కాదు వీకెండ్ మొత్తం సినిమాల జాతరే ఉండబోతుంది. శుక్రవారం వస్తుందంటే సినిమాలకి పండుగ అంటారు. మరి పండుగ కూడా శుక్రవారం వస్తే.. ఇక దాన్నేమంటారు.. 'థియేటర్లో జాతర' అంటారు. మరి ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలేంటో చూసేద్దామా?
విశ్వం:
కామెడీకి కమర్షియ ల్ టచ్ను జోడించి ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ శ్రీను వైట్ల (Srinuvaitla). హీరో గోపీచంద్ (Gopichand) యాక్షన్ కామిక్ ఎంటర్ టైనర్ 'విశ్వం' మూవీ దసరా బరిలో నిలిచింది. ఈ మూవీ శుక్రవారం (అక్టోబర్ 11) థియేటర్లలో రిలీజ్ కానుంది. గోపీచంద్ సరసన బ్యూటీ కావ్య థాపర్ నటించిన ఈ మూవీని.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించారు.
మా నాన్న సూపర్ హీరో
సుధీర్ బాబు, ఆర్ణ జంటగా నటించిన చిత్రం "మా నాన్న సూపర్ హీరో". ఈ చిత్రానికి నూతన డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించగా సునీల్ బలుసు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని తండ్రి సెంటిమెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు.ఈ మూవీ శుక్రవారం అక్టోబర్ 11న థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని సాంగ్స్ మరియు టీజర్, ట్రైలర్ విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా గతేడాది హంట్, ఈ ఏడాది హరోమ్ హర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా సక్సెస్ సాధించలేకపోయిన సుధీర్ బాబు.. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.
శ్రీ శ్రీ శ్రీ రాజావారు:
యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) బావమరిది నార్నే నితిన్(Narne Nithin) మ్యాడ్(Mad) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నాడు.ఇటీవలే ఆయ్ అనే మూవీతో డీసెంట్ హిట్ కొట్టి శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ కాబోతున్నాడు.
ఇందులో భాగంగా నార్నె నితిన్ ప్రస్తుతం శతమానం భవతి ఫేమ్' జాతీయ అవార్డు విన్నర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే టైటిల్ తో గురువారం (అక్టోబర్ 10)న ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇక అదేరోజున రజనీకాంత్ నటించిన వేట్టయన్ మూవీ కూడా తెలుగులో రిలీజ్ అవుతోంది.
ALSO READ | డిజప్పాయింట్ అవ్వకండి అబ్బాయిలు.. దసరాకు కాకపోతే దీపావళి: తమన్ ట్వీట్స్ వైరల్
జనక అయితే గనక:
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ (Suhas), సంగీర్తన జంటగా సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జనక అయితే గనక’(Janaka Aithe Ganaka). శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 12న సినిమా విడుదల కానుంది.
వేట్టయన్:
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా ‘వేట్టయన్ – ది హంటర్’. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ఈ భారీ ప్రాజెక్ట్ ని దసరా బరిలో నిలిపింది. ఈ మూవీ గురువారం (అక్టోబర్ 10న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.
మార్టిన్
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా ఏపీ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘మార్టిన్’. వైభవి శాండిల్య హీరోయిన్. ఉదయ్ కె మెహతా నిర్మించారు. శుక్రవారం అక్టోబర్ 11న పాన్ ఇండియావైడ్‌గా విడుదలవుతోంది. ఎంఎస్ ఫిల్మ్ బ్యానర్‌పై మురళీ పాకాల తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకుహీరో అర్జున్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.
జిగ్రా:
అలియా భట్, వేదాంగ్ రైనా లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్ బాల దర్శకత్వంలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.