బేకరీ యజమానికి 7వేలు ఫైన్

పాల్వంచ, వెలుగు : పట్టణంలోని బస్టాండ్ సెంటర్ లో ఓ బేకరీలో కాలం చెల్లిన కేకులను విక్రయిస్తున్నారని మున్సిపల్​ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆఫీసర్లు  సోమవారం బేకరీలో తనిఖీ చేశారు.  బేకరీలో బూజుపట్టిన కేకులు ఉన్నట్లు మున్సిపల్ సిబ్బంది, ఎస్సై లక్ష్మణ్ రావు గుర్తించారు. వెంటనే దుకాణ యజమానికి రూ.7వేలు ఫైన్​ వేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే బేకరీ సీజ్ చేస్తామని హెచ్చరించారు.