
టిక్ టాక్ ఛాలెంజ్ ఓ బాలిక ప్రాణాలమీదకు తెచ్చింది. వైరల్ అయిన టిక్‌టాక్ ఛాలెంజ్గా తీసుకొని రిపీట్ చేస్తూ బొమ్మ పేలి ఓ బాలిక తీవ్రంగా గాయపడింది.నీడో క్యూబ్ టాయ్ని ఫ్రీజ్ చేసి మైక్రోవేవ్ లో వేడి చేస్తుండగా పేలడంతో ఈ భయానక సంఘటన జరిగింది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లింది.
మిస్సోరిలోని ఫెస్టస్‌కు చెందిన ఏడేళ్ల బాలిక స్కార్లెట్ సెల్బీ మెత్తటి బొమ్మ నీడో క్యూబ్ పేలడంతో కోమాలోకి వెళ్లింది. నీడో క్యూబ్‌లను ఫ్రీజ్ చేసి, ఆపై వేడి చేయడం ద్వారా వాటి ఆకృతిని మార్చే టిక్ టాక్ ప్రయోగాన్ని ఆన్ లైన్ లో చూసింది. ఆ ప్రయోగాన్ని చేస్తూ నీడో క్యూబ్ లను ఫ్రీజ్ చేసింది. ఆ తర్వాత వేడి చేసేందుకు మైక్రోవేవ్ లో ఉంచింది. దానిని బయటికి తీసినప్పుడు నీడో క్యూబ్ ఒక్కసారిగా పేలింది. అందులో వేడి ద్రవం ఆమె ముఖం, ఛాతిపై పడింది. కొంత నోరు ముక్కులోకి కూడా వెళ్లింది. స్కార్లెట్ సెల్బీ బాధతో అల్లాడిపోయింది. గమనించిన పేరెంట్స్ వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్కార్లెట్ నోటి దగ్గర, ముక్కు లోపలి భాంగాలో కాలిన గాయాలతో వాయుమార్గ వాపుకు గురయ్యాయి. దీంతో కోమాలోకి వెళ్లింది.
Also Read :- జుట్టు కోసం వాడిన హెయిర్ ఆయిల్ తో.. కంటి చూపు కోల్పోయి 65 మంది
ఈ బాధాకరమైన సంఘటన తర్వాత నీడో క్యూబ్ ఆట బొమ్మల విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్కార్లెట్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు నీడో క్యూబ్ టాయ్ ఇవ్వొద్దని ఇంట్లో అలాంటి టాయ్స్ ఉంటే వెంటనే పారవేయాలని సూచించారు. బొమ్మ లోపల ఉన్న పదార్థం వేడిచేసినప్పుడు వేడి జిగురులా ఉంటుంది. అవి పేలితే జిగరు చర్మంపై పడితే తొలగించడం చాలా కష్టం.. తీవ్రమైన గాయాలు సంభవిస్తాయని హెచ్చరించాడు. ఆ బొమ్మ భద్రత ,మార్కెటింగ్ గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బొమ్మలను ప్రస్తుత రూపంలో విక్రయించకూడదని వాదించారు.