Life style: ఈ యోగాసనాలతో.. షుగర్కు చెక్ పెట్టండి..

శారీరక, మానసిక ఆరోగ్యం అందించే ప్రక్రియల్లో  యోగా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా యోగా ఆద‌ర‌ణ పొందుతోంది. యోగా భారతదేశంలోను పుట్టిందని.. వేదకాలం నుంచే భారత్ లో యోగా వాడుకలో ఉంది..18 శతాబ్దం రెండో భాగంలో యోగాను పశ్చిమ దేశాలకు స్వామి వివేకానంద ద్వారా బాగా విస్తరించింది. ఈ మధ్య కాలంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 

రత ప్రభుత్వం చేసిన సూచనతో జూన్ 21ని 'అంతర్జాతీయ యోగా డే'గా 2015లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ రోజును పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల్లో కోట్లాది మంది యోగా చేస్తారు. అలాంటి యోగాతో అనేక శారీరక, మానసిక సమస్యలకు చెక్ పెట్టొచ్చని యోగానిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల యోగాసనాలతో షుగర్ కు చెక్ చెప్పొచ్చని అంటున్నారు.. అవేంటో , ఎలా చేయాలో తెలుసుకుందాం.. 

యోగా చేయడం ద్వారా డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. సూర్య నమస్కారం యోగాతో బ్లడ్ షుగర్  లెవెల్స్ ను నియంత్రణలో తెచ్చుకోవచ్చు. 

ధనురాసనం.. ఇన్సులిన్ ఉత్పత్తి, జీర్ణక్రియ మెరుగుపర్చడంలో ధనురాసన్ ఎంతో సహాయపడుతుంది. 

అర్థమత్స్యేంద్రాసనం.. అర్థమత్స్యేంద్రాసనంచేయడం ద్వారా క్లోమంతో సహా అంతర్గత అవయవాలను మర్దనం చేసి యాక్టివేట్ చేస్తుంది. ఇది బ్లడ్ షుగర్ ను క్రమబద్దీకరిస్తుంది. ఇది జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. 

భుజంగాసనం..  భుజంగాసనం వేయడం ద్వారా వెన్నెముక ఆరోగ్యం, అంతర్గత అవయవాలను యాక్టివేట్ చేస్తుంది. జీవక్రియకు సహకరిస్తుంది. మానసిక వత్తిడిని తగ్గిస్తుంది. 

పశ్చిమోత్తనాసనం.. పశ్చిమోత్తనాసనం..కూర్చోని ముందుకు వంగి చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ స్నాయువులను సాగదీయడంలో సహాయపడుతుంది. ఇది కాలేయం, మూత్రపిండాలు , క్లోమాన్ని కూడా ప్రేరేపిస్తుంది.  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

విపరీత కరణి.. ఈ ఆసనం రక్త ప్రసరణ బాగా జరగడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. 

పదంగుస్థాసనం..ఈ ఆసనం ద్వారా పిక్కలు, తొడల కండరాలు, దిగువ వీపు భాగంలోని కండరాల సాగదీయబడతాయి. పొట్ట అవయవాలను కూడా యాక్టివేట్ చేయడంతో ఈ ఆసనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.