కాగజ్‌నగర్, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను చింతలమానేపల్లి మండలం గూడెం అంతర్రాష్ట్ర బ్రిడ్జి వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను టాస్క్‌ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ వెల్లడించారు. కొందరు వ్యక్తులు కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్రకు నకిలీ విత్తనాలు తరలిస్తున్నారని సమాచారం అందడంతో ఆఫీసర్లు గూడెం గ్రామం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ టైంలో బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను గమనించి విత్తనాల బ్యాగ్‌లను పక్కన పడేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆఫీసర్లు వెంబడించి ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని గంగాపూర్ గ్రామానికి చెందిన చపిలె వినోద్‌గా గుర్తించారు. అతడితో పాటు అదే గ్రామానికి చెందిన చపిలె పురుషోత్తం, భూపాలపట్నం గ్రామానికి చెందిన బొల్లేబోయిన అశోక్, బొల్లబోయిన కృష్ణ కలిసి నకిలీ విత్తనాలను మహారాష్ట్రకు తరలిస్తున్నారని చెప్పారు.
నలుగురిపై కేసు నమోదు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వినోద్‌ను చింతలమానేపల్లి పీఎస్‌లో అప్పగించారు. 70 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 1.50 లక్షలు ఉంటుందని సీఐ చెప్పారు. ఎస్సై వెంకటేశ్, సిబ్బంది మధు, రమేశ్, సంజీవ్ ఉన్నారు.