రూ. 70వేల మద్యం పట్టివేత

ఏటూరునాగారం,వెలుగు: అక్రమంగా కారులో తరలిస్తున్న మద్యాన్ని ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఫారెస్ట్​​ చెక్​పోస్టు వద్ద ఎక్సైజ్​ ఆఫీసర్లు శనివారం పట్టుకున్నారు. ఎక్సైజ్​ సీఐ రామక్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం..  చెక్​ పోస్టు వద్ద వాహనాల తనిఖీ  చేస్తుండగా..  అనుమానాస్పదంగా కనిపించిన టాటా ఇండికా కారును తనిఖీ చేశామన్నారు.

దాంట్లో   20 కాటన్ల బీర్లు, 3 కాటన్ల మద్యం ఉన్నట్లు తెలిపారు. కారులో  ఉన్న  వారిని విచారించగా మండలంలోని మల్యాల గ్రామానికి కొండా మహేందర్​, ముక్కెర రవళిగా గుర్తించి ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా రూ. 68700   మద్యం, కారు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో  సీఐతో పాటు  కానిస్టేబుల్లు​ సందీప్​, తిరుపతి, నవీన్​, నాగరాజు, వీరన్న, శ్రీనివాస్​, ప్రణవ్​ పాల్గొన్నారు.