అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇందులో భాగంగా రెండు లారీలు, రెండు బోలేరో ట్రాలీలను సీజ్ చేసి.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర అధికారులు రెండు లారీలను పట్టుకోగా, మరో రెండు బోలేరో ట్రాలీ వాహనాల డ్రైవర్లు తప్పించుకోని మహరాష్ట్ర వైపుకు వెళ్తుండగా అధికారులు వెంబడించి పట్టుకొని నాలుగు వాహనాలను కాళేశ్వరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇందులో భాగంగా సుమారు 700 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని.. నలుగురిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. నలుగురు డ్రైవర్లపై కేసు నమోదు చేసి, నాలుగు వాహనాలను సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.