మన దేశంలోనే ఐఐటీలు సూపర్ స్కిల్స్, వెల్ ఎడ్యుకేషన్ కు పెట్టింది పేరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలో సీటు కొట్టాడంటే లక్షల జీతంతో జాబ్ జేబులో పెట్టుకున్నట్లే.. కానీ, అది ఒకప్పటి మాట. ఇప్పుడు అంతపెద్ద చదువులు సదివినా జాబ్ రావట్లేదంట. IIT కాన్పూర్ ఓల్డ్ స్టూడెంట్ ధీరజ్ సింగ్ దేశంలోని మొత్తం 23 IIT క్యాంపస్లలో పాస్ ఔట్ అయిన స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్లపై RTIతో సమాచారం కోరాడు. ధీరజ్ సింగ్ కు వచ్చిన సమాధానంలో షాకింగ్ న్యూస్ వెల్లడైంది. వేలమంది ఐఐటీ స్టూడెంట్లు జాబులు రాక నిరుద్యోగితను ఎదుర్కుంటున్నారని రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తేలింది
2023-24 అకాడమిక్ ఈయర్ కంప్లీట్ అయిన తర్వాత 7వేలకు పైగా ఐఐటీ స్టూడెంట్లు జాబ్ లు రాలేదని తేలింది. రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 3,400గా ఉందని RTI సమాచారంలో బయటపడింది. IIT ఢిల్లీలో దాదాపు 400, IIT బాంబేలో 250 మంది ఐఐటియన్లు జాబ్ లు రాక ఖాళీగా ఉన్నారు. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్)లో చదివినా కూడా ఉద్యోగాలు దొరకడం లేదు.
ప్రతి ఐఐటీ క్యాంపస్ లో 30శాతం ప్లేస్ మెంట్లు తగ్గాయని ప్రొఫెసర్లు చెబుతున్నారు. క్యాంపస్ ప్లేస్ మెంట్ లో తమ క్యాంపస్ స్టూడెంట్లకు హెల్ప్ చేయాలని ఆయా సంస్థలు కంపెనీలను గత కొన్ని నెలలుగా కోరుతున్నాయి. ఏఐ, చాట్ జీపీటీ, లెటెస్ట్ అప్డేటెడ్ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. క్యాంపస్ ప్లేస్ మెంట్లో పాల్గొనే వారి సంఖ్య 12శాతం పెరగగా.. అందులో నిరుద్యోగులుగా మిగిలిపోయిన వారు 24 శాతంగా ఉన్నారని డేటా చెప్తోంది.