IT News: భారత టెక్కీలపై సంచలన రిపోర్ట్.. ఛీ కంపెనీలు ఇలా చేస్తున్నాయా..?

IT News: భారత టెక్కీలపై సంచలన రిపోర్ట్.. ఛీ కంపెనీలు ఇలా చేస్తున్నాయా..?

IT Working Hours: ఇండియన్ సర్వీస్ సెక్టార్ వేగంగా అభివృద్ధికి కారణం ఐటీ ఇండస్ట్రీ. ప్రపంచ వ్యాప్తంగా నమ్మదగిన ఐటీ సేవల సరఫరాదారుగా భారత్ గుర్తింపు తెచ్చుకుంది. దీనికి కారణం టాలెంటెడ్ వర్క్ ఫోర్స్ తక్కువ వేతనాలకు అందుబాటులో ఉండమే. అందుకే ప్రధానంగా అమెరికా నుంచి యూకే వరకు అనేక దేశాలకు ఇండియన్ ఐటీ కంపెనీలు తమ సేవలను ఎగుమతి చేస్తుంటాయి. కానీ ఈ పరిశ్రమలోని ఉద్యోగుల వ్యతలకు సంబంధించిన ఒక సంచలన రిపోర్టు అందరినీ ఆలోచిపంజేస్తోంది. 

వాస్తవానికి వారానికి లేబర్ చట్టాల ప్రకారం ఉద్యోగులు వర్క్ చేయాల్సింది 48 గంటలు మాత్రమే. కానీ ఈ రంగంలో పనిచేస్తున్న 72 శాతం మంది ఉద్యోగులు అధిక గంటలు పనిచేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. అలాగే సగటున ప్రతి నలుగురిలో ఒకరు వారానికి 70 గంటలకు పైగా పనిచేస్తున్నట్లు బ్లిన్స్ సర్వే వెల్లడించింది. మార్చిలో దాదాపు 1450 మంది ఐటీ ఉద్యోగులతో నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఎక్కువ పనిగంటల పాటు వర్క్ చేసేలా చేస్తున్నట్లు వాపోతున్నారు. దీంతో 83 శాతం మంది అలసటకు గురవుతున్నట్లు వెల్లడించారు. 

ALSO READ | బెంగళూరు బ్యాడ్‌డేస్.. తెలుగు టెక్ ఫ్యామిలీలకు కష్టాలు..!

తీవ్రమైన పని సుదీర్ఘ పనిగంటలు కలిగిన టాప్ 20 కంపెనీల్లో కాన్ఫ్లూయెంట్, ఇంట్యూట్, యుఐపాత్, అడోబ్, ఉబెర్, ఇన్‌మోబి, సేల్స్‌ఫోర్స్, వాల్‌మార్ట్, స్ప్రింక్లర్, ఒరాకిల్, కోహెసిటీ, అమెజాన్, సర్వీస్‌నౌ, విఎంవేర్, సిస్కో, అట్లాసియన్, పేపాల్, ఫ్లిప్‌కార్ట్, ఫ్రెష్‌వర్క్స్, మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వీటిలో పనిచేస్తున్నవారిలో ఎక్కువ మంది ఉద్యోగులు చట్టబద్ధమైన 48 గంటల పరిమితిని మించి వర్క్ చేస్తున్నారని తేలింది. పైగా పని గంటల తర్వాత కూడా ఆఫీసు మెయిల్స్, మెసేజ్ లకు సమాదానాలు ఇస్తున్నట్లు 68 శాతం మంది పేర్కొన్నారు. 

ఈ విపరీతమైన పనివేళలకు ప్రధాన కారణం అధిక పనివేళల ఒత్తిడిగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఒత్తిడి భారతదేశ ఐటీ రంగంలో అధిక పనివేళలతో పాటు అలసటకు దారితీస్తోందని తెలుస్తోంది. చాలా మంది ఉద్యోగులు ఇలాంటి అధిక పనిగంటలు మెరుగైన ఉత్పాదకతకు దారితీయవని అభిప్రాయపడుతున్నారు. ఇలా ఆరు నెలల పాటు పనిచేస్తే ఎవరైనా విసిగిపోతారని ఒరాకిల్ ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు. 

దీనికి ముందు కొన్ని నెలల కిందట ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఉద్యోగులకు వారానికి 70 గంటలకు పిలుపివ్వగా.. ఎల్అండ్ టి ఛైర్మన్ యువత వారానికి 70 నుంచి 90 గంటలు పనిచేయాలని చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో కంపెనీలు అందించిన వర్క్ ఫ్రమ్ హోం సమయంలో ఎక్కువ సమయం ఆన్ లైన్లో ఉద్యోగులు అందుబాటులో ఉన్న సమయం నుంచి ఈ ధోరణి పెరిగిందని ఉద్యోగులు చెబుతున్నారు.