పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72శాతం పోలింగ్‌

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72.44 శాతం పోలింగ్‌ నమోదైంది.  ఈ విషయాన్ని  ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.   నియోజకవర్గ వ్యాప్తంగా 4,63,839 ఓట్లకు గాను 3,36,013 ఓట్లు పోలయ్యాయని రిటర్నింగ్ ఆఫీసర్ హరిచందన తెలిపారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో  76.35 శాతం పోలింగ్‌ నమోదు కాగా... ఈసారి పోలింగ్‌ శాతం తగ్గింది. 

జూన్ 5 ఫలితాలను వెల్లడించనున్నారు.  ఈ ఉప ఎన్నికలో మొత్తం 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న,  బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి  ప్రేమేందర్‌రెడ్డి బరిలో నిలిచారు.  జెంబో బ్యాలెట్ కావడంతో లెక్కింపుకు కనీసం మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. 

ఈ సీటు నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికను ఈసీ నిర్వహించింది.