న్యూఢిల్లీ : 2024–-25 అసెస్‌మెంట్ సంవత్సరం కోసం గత నెల 31 గడువు నాటికి 7.28 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు వచ్చాయని ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం వెల్లడించింది. గత ఏడాది 6.77 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. తాజాగా అందిన మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్‌లలో పాత పన్ను విధానంలో
2.01 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. కొత్త పన్ను విధానాన్ని 5.27 కోట్ల మంది ఎన్నుకున్నారు. జులై 31న ఒక్కరోజే 69.92 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు జరిమానాతో ఐటీఆర్‌ను ఇవ్వవచ్చని ఐటీశాఖ తెలిపింది.