సూర్యాపేట జిల్లాలో 74.61 శాతం పోలింగ్ : కలెక్టర్ వెంకట్ రావు

  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకట్ రావు 

సూర్యాపేట, వెలుగు :  లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్​రావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ కంట్రోల్ సెల్ నుంచి నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఓటింగ్ జరిగిందన్నారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,91,843 ఓట్లు పోల్ కాగా 76.30 శాతం

 కోదాడలో 1,84,261 ఓట్లు పోల్ కాగా 75.15 శాతం,  సూర్యాపేటలో 1,78,214 ఓట్లు పోల్ కాగా 73.00 శాతం పోలింగ్​ నమోదైనట్లు తెలిపారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని తుంగతుర్తి అసెంబ్లీ లో 1,91,845 ఓట్లు పోల్ కాగా 74.00 శాతం నమోదైనట్లు తెలిపారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గాను 7,46,163 ఓట్లు పోల్​గాను 74.61 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను నల్గొండ, భువనగిరి లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపర్చామని తెలిపారు.