రిచెస్ట్ బెగ్గర్‌‌ సంపద రూ.7.5 కోట్లు

రిచెస్ట్ బెగ్గర్‌‌ సంపద రూ.7.5 కోట్లు

ముంబై: బెగ్గరే కానీ..ఆయన ఆస్తి విలువ రూ. 7.5 కోట్లు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బెగ్గర్‌‌‌‌గా ముంబైకి చెందిన భరత్ జైన్‌‌ పేరుగాంచారు. చిరిగిన చొక్కా, చింపిరి జుట్టు, మురికి బట్టలతో జైన్ కనిపిస్తున్నా, ఆయన అత్యంత కాస్ట్లీ సిటీ అయిన ముంబైలోనే  రెండు అపార్ట్‌‌మెంట్లను మెయింటైన్ చేస్తున్నారు. వీటి విలువ రూ. 1.2 కోట్ల పైనే ఉంటుందని అంచనా. అంతేకాకుండా థానేలో రెండు షాప్‌‌లను అద్దెలకు  కూడా ఇచ్చాడు. వీటి నుంచి నెలకు రూ.30 వేల ఇన్‌‌కమ్‌‌ సంపాదిస్తున్నాడు. పేదరికం వలన జైన్  చదువు కోలేకపోయాడు. కానీ,  ఆయన భార్య, ఇద్దరు పిల్లలు,  ఫాదర్‌‌‌‌, బ్రదర్‌‌‌‌ను బాగా చూసుకుంటున్నాడు. భరత్ జైన్  సంపద రూ.7.5 కోట్లు అని, బెగ్గింగ్ ద్వారా నెలకు రూ.60 వేల నుంచి రూ.70 వేలు సంపాదిస్తాడని జీన్యూస్ రిపోర్ట్ చేసింది. చత్రపతి శివాజి టెర్మినస్‌‌ లేదా ఆజాద్ మైదాన్ వంటి రద్దీ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఆయన అడుక్కుంటాడని వెల్లడించింది.  

రూ. కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ భరత్‌‌ జైన్ ఇంకా ముంబై వీధుల్లో అడుక్కుంటున్నాడు.  రోజంతా పనిచేసినా  రూ. కొన్ని వందలు కూడా సంపాదించడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటే, జైన్ మాత్రం  10–12 గంటల్లోనే రూ.2,000–2,500 సంపాదిస్తున్నాడు. జైన్, అతని ఫ్యామిలీ ముంబైలో వన్ బీహెచ్‌‌కే డూప్లెక్స్‌‌ రెసిడెన్స్‌‌లో నివసిస్తున్నారు. ఆయన పిల్లలు కాన్వెంట్‌‌ స్కూళ్లలో చదువుతున్నారు. ఇతర ఫ్యామిలీ మెంబర్లు స్టేషనరీ స్టోర్లు, ఇతర బిజినెస్‌‌లు చేసుకుంటున్నారు. అడుక్కోవడం ఆపేయాలని వీరు  జైన్‌‌కు చెబుతున్నా, ఆయన మాత్రం తనకు అన్నం పెట్టిన పనిని విడిచి పెట్టడానికి ఇష్టపడడం లేదు. భరత్ జైన్‌‌ స్టోరీ వింటుంటే ఆయన తనకు అనుకూలంగా లేని పరిస్థితులను ఎంత తెలివిగా  వాడుకున్నాడో తెలుస్తోంది.