
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్పోస్టుల భర్తీకి ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 28 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు .
పోస్టులు 75 : ఫిజియాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అండ్ బ్లడ్‌బ్యాంక్, మైక్రోబయాలజీ, ఓబీజీవై, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, పీడీయాట్రిక్స్ అండ్ నియోనెటాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, జనరల్ అండ్మెడిసిన్ అండ్ సూపర్ స్సెషాలిటీస్, జనరల్ సర్జరీ అండ్ సూపర్ స్పెషాలిటీస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, ఓబీజీవై, అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ.
ఎలిజిబిలిటీ : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్, పీహెచ్ డీ(ఎంఎస్సీ, ఎంబయోటెక్)లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.