
సోషల్ మీడియా అంటేనే వింతలకు..విశేషాలకు నిలయం. కొత్త కొత్త విషయాలు..సరికొత్త, గమ్మత్తైన వీడియోలు నెటిజన్లను విపరీతం ఆకర్షిస్తుంటాయి. విశేషంగా ఆనందింపచేస్తుంటాయి. ఇలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఓ వృద్ధుడు యువకుడిగా మారిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
15 నిమిషాల ఈ వీడియోలో 75 ఏళ్ల ఓ వృద్ధుడు బైక్ పై విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. తెల్లటి గడ్డం, తెల్లటి వస్త్రాలు ధరించిన ఓ ముసలాయన..బైక్ పై స్టంట్స్ చేసి ఆశ్చర్యపోయేలా చేశాడు. నడిరోడ్డుపై రయ్య మంటూ దూసుకెళ్తూ బైక్ హ్యాండిల్ మీద నుంచి చేతులు తీసేసి నడిపాడు. మరోసారి బైక్ వెనుక పడుకుని డ్యాన్స్ చేశాడు. ఈ తాత విన్యాసాలను మరో వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.
इन्हीं हरकतों की वजह से सरकार ने पुरानी पेंशन योजना बंद की है। ? pic.twitter.com/9On89AL5SJ
— Ankit Yadav Bojha (@Ankitydv92) August 13, 2023
అయితే ఈ వీడియో ప్రమాదకరమైనదే అయినా.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా జనం వీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. 5వేలకు పైగా జనం లైక్స్ కొట్టారు. అయితే కొందరు నెటిజన్లు ఈ వీడియోపై భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వృద్ధుడికి ఈ వయసులు ఈ స్టంట్స్ అవసరమా అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరికొందరైతే ఈ వయసులో కూడా ఇంత ధైర్యంగా ఉన్నాడు అంటూ కామెంట్ చేశారు.