
- 75 ఏండ్ల వృద్ధురాలిని చీట్ చేసిన సైబర్ నేరగాళ్లు
బషీర్‌బాగ్, వెలుగు: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ప్రమేయం ఉందంటూ సైబర్‌నేరగాళ్లు 75 ఏండ్ల వృద్ధురాలిని చీట్ చేశారు. ఆమె నుంచి రూ.73 లక్షలు కొట్టేశారు. సికింద్రాబాద్ ఏరియాకు చెందిన వృద్ధురాలు రిటైర్డ్గవర్నమెంట్ఎంప్లాయ్. వారం కింద ఆమెకు టెలికాం డిపార్ట్‌మెంట్‌నుంచి అంటూ స్కామర్లు కాల్ చేశారు. ‘మీ ఆధార్‌కార్డుతో లింక్‌అయి ఉన్న ఫోన్‌నంబర్ నుంచి అసభ్యకర మెసేజ్‌లు, కాల్స్వెళ్తున్నాయి. బెంగళూరులోని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది’ అని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత వృద్ధురాలికి పోలీస్ యూనిఫామ్ తో మరో వ్యక్తి వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. సాదత్ ఖాన్ అనే నేరస్తుడిని అరెస్ట్ చేశామని.. అతను మీ ఆధార్ కార్డు ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ ఓపెన్చేశాడని, అక్రమ లావాదేవీలు జరిపాడని నమ్మబలికాడు.
అతనికి హ్యూమన్ట్రాఫికింగ్కేసులో ప్రమేయం ఉందని భయపెట్టాడు. మీపై అరెస్ట్ వారెంట్ ఉందని, బ్యాంక్అకౌంట్స్ ఫ్రీజ్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత సీబీఐ అధికారినంటూ మరో వ్యక్తి వృద్ధురాలికి వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. బ్యాంక్ అకౌంట్ల వివరాలు, లావాదేవీలు చెప్పాలని బెదిరించాడు. నమ్మించేందుకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ జారీ చేసినట్లు ఫేక్ లెటర్ పంపించాడు. బయపడిపోయిన వృద్ధురాలు అతను చెప్పినట్లుగా రూ.73,50,000ను వేర్వేరు అకౌంట్లకు ట్రాన్స్ఫర్చేసింది. తర్వాత కాల్స్ఆగిపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు ఫైల్చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.