రాజ్యాంగం ద్వారానే బానిస బతుకులకు విముక్తి : బక్కి వెంకటయ్య

రాజ్యాంగం ద్వారానే బానిస బతుకులకు విముక్తి : బక్కి వెంకటయ్య
  • ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

మెదక్, వెలుగు: భారత రాజ్యాంగం ద్వారానే బానిస బతుకులకు విముక్తి కలిగిందని,  అటువంటి రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను తిప్పికొట్టాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్  చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. టీఎన్జీవో నాయకుడు జెల్ల సుధాకర్, దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) మెదక్ జిల్లా కమిటీ అధ్వర్యంలో ఆదివారం మెదక్ లోని ఇందిరాగాంధీ స్టేడియంలో  75 ఏళ్ల భారత రాజ్యాంగ ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటయ్య  చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడుతూ..దేశానికి దక్షణ భారత దేశంలో రెండో రాజధాని ఉండాలన్న  ప్రతిపాదన అంబేద్కర్​ముందు చూపుకు నిదర్శనమన్నారు.

పొరాడి బానిస సంకెళ్ల నుంచి విముక్తి  పొందాలన్నారు. అడ్వకేట్​దేవరాజ్ గౌడ్  మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన  రాజ్యాంగం వల్ల  విద్య, ఉద్యోగాలు, సంపదలు వచ్చాయన్నారు. టీఎన్ జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ నిద్రలో ఉన్న బీసీలు మేల్కొని రాజకీయ అధికారాన్ని సాధించుకోవాలన్నారు. డీబీఎఫ్​ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సొదరభావం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయన్ని రాజ్యంగం అందించిందన్నారు.

కార్యక్రమంలో అంబేద్కర్​ కాంస్య  విగ్రహ కమిటీ అధ్యక్షుడు గంగాధర్, బహుజన నాయకుడు వెంకన్న,  గౌడ సంఘం నాయకుడు బాల్ రాజ్ గౌడ్, తెలంగాణ సాంఘిక గురుకుల స్కూల్​వైస్ ప్రిన్సిపాల్ పద్మావతి, టీచర్​అర్చన కులకర్ణ, డీబీఎఫ్​జిల్లా అధ్యక్షుడు సంజీవ్, జిల్లా కార్యదర్శి దయా సాగర్ పాల్గొన్నారు.